Aided Educational Institutions: ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అంతర్గత మెమో జారీ చేసింది. ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యా సంస్థలకు పునరాలోచనకి అవకాశం ఇచ్చింది...

Aided Educational Institutions: ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ..
Ap

Updated on: Nov 12, 2021 | 10:23 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అంతర్గత మెమో జారీ చేసింది. ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యా సంస్థలకు పునరాలోచనకి అవకాశం ఇచ్చింది. ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్‌ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

2,249 ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించగా.. 702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని ప్రభుత్వం వెల్లడించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని ఉన్నత విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది.

సర్కార్ ఇచ్చిన ఆప్షన్లు

1వ ఆప్షన్‌: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా ప్రభుత్వంలో విలీనానికి సుముఖత.

2వ ఆప్షన్‌: ఆస్తులు మినహా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా కొనసాగే అవకాశం.

3వ ఆప్షన్‌: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.

4వ ఆప్షన్: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.

 

Read Also..  Fire Accident: విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..