చెప్పుడు మాటలు విని చంద్రబాబు తనను దూరం పెట్టారని మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం టీడీపీని వీడిన సతీష్ రెడ్డి.. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్‌కు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. తనకు చావ తగ్గలేదని అన్నారు. ఇప్పుడు తనపై బాధ్యత పెరిగిందని.. కానీ పోరాడేందుకు కావాల్సిన భరోసా లేదని తెలిపారు. ఓడిపోయిన తరువాత చంద్రబాబు పిలిచి మాట్లాడిన సందర్భం లేదని ఆయన మనోవేదన వ్యక్తం చేశారు. తనకు వేధింపులు ఉన్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని.. బాబు ఇప్పటికైనా మారాలని అన్నారు. కాంప్రమైజ్ అన్నది తన రక్తంలోనే లేదని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈ సందర్భంగా సతీష్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సతీష్ రెడ్డి రాజీనామా చేయడంతో.. పులివెందుల ఇంచార్జ్‌గా టీడీపీ అధిష్టానం బీటెక్ రవిని నియమించారు.