గాలివాన బీభ‌త్సం..పిడుగు పడి నవ వరుడు సహా ఐదుగురు మృతి

బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్ప‌పీడ‌న ద్రోణి ప్ర‌భావం దేశంలోకి ప్ర‌వేశించింది. ఏపీ, త‌మిళ‌నాడు, తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాల్లో గాలి,ఉరుములు, మెరుపుల‌తో కూడి వ‌ర్షాలు అప్పుడే బీభ‌త్సం సృష్టిస్తున్నాయి.

గాలివాన బీభ‌త్సం..పిడుగు పడి నవ వరుడు సహా ఐదుగురు మృతి

Updated on: Apr 27, 2020 | 9:53 AM

బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్ప‌పీడ‌న ద్రోణి ప్ర‌భావం దేశంలోకి ప్ర‌వేశించింది. ఏపీ, త‌మిళ‌నాడు, తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాల్లో గాలి,ఉరుములు, మెరుపుల‌తో కూడి వ‌ర్షాలు అప్పుడే బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన వ‌ర్షాల కార‌ణంగా పిడుగులు ప‌డి న‌వ వ‌రుడు స‌హా ఐదుగురు ప్రాణాలు కొల్పోయారు.

తమిళనాడులో ఆదివారం భారీ వర్షం కురిసింది. తెల్ల‌వారుజామున మొద‌లైన వ‌ర్షం ఏక‌ధాటికి సుమారు ఐదారు గంటల పాటు కురిసింది. కాంచీపురంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన నవ వరుడు పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. అటు, తిరువళ్లూర్‌ జిల్లా నేమలూరులో రైతు చంద్రన్‌, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు నదిలో చేపలు పడుతున్న ఆనందన్‌, రాణిపేట జిల్లాలో పొలానికి వెళుతున్న ప్లస్‌ వన్‌ విద్యార్థిని మహాలక్ష్మిలు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. అలాగే, నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూరులో పెరుమాళ్‌ అనే వ్యక్తిపై కొబ్బరి చెట్లు విరిగి పడిన ఘటనలో అతడు అక్క‌డిక‌క్క‌డే  మృతిచెందాడు.

ఇక ఏపీలో ఆదివారం కుండ‌పోత వ‌ర్షంప‌డింది. ప‌లు చోట్ల పిడుగులు ప‌డ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ల చిన్నారి పిడుగు పడి మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ‌ హెచ్చ‌రించింది.