బ్రేకింగ్: నెల్లూరు మాజీ తహశీల్దార్‌పై ఈడీ కేసు.. ఆస్తులు జప్తు!

|

Nov 27, 2019 | 8:32 PM

మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఏపీ మాజీ తహశీల్దార్ గంటా సుశీలకు సంబంధించిన రూ.కోటి రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఇకపోతే జప్తు చేసిన ఆస్తి వివరాలను పరిశీలిస్తే.. నెల్లూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరు ప్లాట్లు, ఒక అపార్ట్మెంట్.. బెంగుళూరులో ఉన్న ఒక అపార్ట్మెంట్.. మూడు ఇళ్ళు, ఒక కారు ఉన్నాయి. సుశీలతో పాటుగా ఆమె కుమారుడు, కూతురుకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఆమె పలు […]

బ్రేకింగ్: నెల్లూరు మాజీ తహశీల్దార్‌పై ఈడీ కేసు.. ఆస్తులు జప్తు!
Follow us on

మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఏపీ మాజీ తహశీల్దార్ గంటా సుశీలకు సంబంధించిన రూ.కోటి రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఇకపోతే జప్తు చేసిన ఆస్తి వివరాలను పరిశీలిస్తే.. నెల్లూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరు ప్లాట్లు, ఒక అపార్ట్మెంట్.. బెంగుళూరులో ఉన్న ఒక అపార్ట్మెంట్.. మూడు ఇళ్ళు, ఒక కారు ఉన్నాయి.

సుశీలతో పాటుగా ఆమె కుమారుడు, కూతురుకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఆమె పలు ప్రభుత్వ పదవులను నిర్వర్తిస్తూ.. అవినీతికి పాల్పడిందని దర్యాప్తులో వెల్లడైంది. తనకు, తన కుటుంబ సభ్యుల ఆదాయానికి మించి ఆమె ఆస్తులను సంపాదించిందని ఈడీ ఆరోపించింది. ఆమెపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ ఛార్జ్ షీట్‌ని దాఖలు చేసింది.