గ్రామ సచివాలయ పరీక్షల్లో ఎంతమందికి ‘సున్నా’లు వచ్చాయంటే..!

| Edited By: Pardhasaradhi Peri

Sep 22, 2019 | 12:20 PM

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ/ వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సున్నా మార్కులు ఎంతమందికి వచ్చాయో తెలుసా.. ఏకంగా 2478 మంది అభ్యర్థులకు. మరికొందరికి సున్నా కంటే తక్కువగా మైనస్‌లలో కూడా మార్కులు వచ్చాయి. పరీక్షలో నెగటివ్ మార్క్స్ ఉండటం.. ప్రశ్నాపత్రం కఠినంగా ఉండటంతో ఇలా సున్నా, మైనస్ మార్కులు వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కేటగిరీ-1 లోని పంచాయితీ కార్యదర్శి, డిజిటల్ కార్యదర్శి వంటి […]

గ్రామ సచివాలయ పరీక్షల్లో ఎంతమందికి సున్నాలు వచ్చాయంటే..!
Follow us on

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ/ వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సున్నా మార్కులు ఎంతమందికి వచ్చాయో తెలుసా.. ఏకంగా 2478 మంది అభ్యర్థులకు. మరికొందరికి సున్నా కంటే తక్కువగా మైనస్‌లలో కూడా మార్కులు వచ్చాయి. పరీక్షలో నెగటివ్ మార్క్స్ ఉండటం.. ప్రశ్నాపత్రం కఠినంగా ఉండటంతో ఇలా సున్నా, మైనస్ మార్కులు వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కేటగిరీ-1 లోని పంచాయితీ కార్యదర్శి, డిజిటల్ కార్యదర్శి వంటి పోస్టుల క్వశ్చన్ పేపర్స్ చాలా కఠినంగా వచ్చాయని కొంతమంది అభ్యర్థులు వాపోతున్నారు. గ్రూప్-1,2 స్థాయిలో కఠిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయిని.. అందుకే 11.63లక్షల మంది పరీక్షలు రాయగా.. చాలా మందికి సున్నా కన్నా తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు గ్రామ సచివాల నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ముందే
లీక్ అయిందని ఓ దినపత్రిక ప్రచురించిన కథనంపై వారు ఫైర్ అవుతున్నారు. క్వశ్చన్ పేపర్ టైప్ చేసిన ఉద్యోగే పరీక్ష రాసిందని.. పరీక్షల్లో ఆమెనే టాపర్‌గా నిలిచిందని ఆ కథనం తెలిపింది. ఇక ఎగ్జామ్ టాపర్స్‌లో ఏపీపీఎస్సీలో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులు ఉన్నారని అందులో పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది.