ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. కృష్ణానదీ జలాలతో ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ చెరువులు నింపాలని కోరారు. ఇప్పటికీ గ్రామాల్లో తాగునీటి కొరత ఉందని గుర్తు చేశారు. నీటి సరఫరా విషయంలో ఆలస్యం చేస్తే రాబోయే రోజుల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.