కోడెల కుటుంబానికి మరో షాక్
టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన గౌతమ్ హోండా షోరూమ్‌ను అధికారులు సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు వారు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో పేర్కొన్నారు. మరోవైపు కోడెల బినామీ యర్రంశెట్టి మోట్సార్స్‌లో టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించగా.. నరసరావుపేట, గుంటూరులో అతడికి చెందిన రెండు షోరూమ్‌లను అధికారులు […]
టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన గౌతమ్ హోండా షోరూమ్‌ను అధికారులు సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు వారు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో పేర్కొన్నారు. మరోవైపు కోడెల బినామీ యర్రంశెట్టి మోట్సార్స్‌లో టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించగా.. నరసరావుపేట, గుంటూరులో అతడికి చెందిన రెండు షోరూమ్‌లను అధికారులు సీజ్ చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కోడెల కుటుంబం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై ఇప్పటికే పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.