రేపు ఢిల్లీకి సీఎం జగన్..ప్రధానితో భేటీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇజ్రాయిల్ పర్యటనను ముగించుకొని నేడు అమరావతి చేరుకున్నారు. రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న సీఎం..ఎల్లుండి వరకు అక్కడే పర్యటించనున్నారు. మంగళవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీతో కానున్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానికి సీఎం నివేదిక ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల రద్దు, పీపీఏలపై సమీక్ష గురించి ప్రధానికి జగన్ వివరించనున్నారు. బుధవారం రాష్ట్రపతి కోవింద్‌తో పాటు […]

రేపు ఢిల్లీకి సీఎం జగన్..ప్రధానితో భేటీ!

Updated on: Aug 05, 2019 | 4:35 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇజ్రాయిల్ పర్యటనను ముగించుకొని నేడు అమరావతి చేరుకున్నారు. రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న సీఎం..ఎల్లుండి వరకు అక్కడే పర్యటించనున్నారు. మంగళవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీతో కానున్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానికి సీఎం నివేదిక ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల రద్దు, పీపీఏలపై సమీక్ష గురించి ప్రధానికి జగన్ వివరించనున్నారు. బుధవారం రాష్ట్రపతి కోవింద్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జగన్ సమావేశమవుతారు.