AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ క్రీడాకారులపై సీఎం జగన్ వరాల జల్లు! 

క్రీడారంగంలో జాతీయ పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల(ఆగస్టు) 29న ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ  మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘క్రీడారంగానికి కొత్తశోభను తీసుకువస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నెల 29న క్రీడాదినోత్సవం సందర్భంగా 2014 నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తాం. […]

ఏపీ క్రీడాకారులపై సీఎం జగన్ వరాల జల్లు! 
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 27, 2019 | 11:22 PM

Share

క్రీడారంగంలో జాతీయ పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల(ఆగస్టు) 29న ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ  మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘క్రీడారంగానికి కొత్తశోభను తీసుకువస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నెల 29న క్రీడాదినోత్సవం సందర్భంగా 2014 నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తాం. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం’  అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దామని జగన్ అన్నారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.5లక్షలు, వెండి పతకం సాధించిన వారికి రూ.4లక్షలు, కాంస్యం గెలుచుకున్న వారికి రూ.3 లక్షలు అందిద్దాం. జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి.

ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25లక్షలు, వెండిపతకం సాధిస్తే రూ.75వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు ఇచ్చి ప్రోత్సహిద్దాం. తగిన ప్రోత్సాహం ఇస్తేనే వీళ్లంతా పీవీ సింధూలుగా మారుతారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేద్దాం. 29 నుంచి వారం రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగాలి’ అన్నారు.

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..