టీడీపీ అధినేత నేత చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 27న ఆయన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా వెళ్లనున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం నాలుగు రోజుల పాటు అక్కడే వుంటారు. అనంతరం ఆగష్టు 1న తిరిగి ఏపీకి రానున్నారు. గతేడాది కూడా చంద్రబాబు అమెరికాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆయన అమెరికా వెళుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజుల పాటు జరగనున్నాయి. ముందుగా అసెంబ్లీ సమావేశాల తరువాత వెళ్లాలని భావించినా.. తిరిగి ఆదివారమే షెడ్యూల్ ఖరారైంది.