ఈనెల 7 నుంచి చంద్రబాబు ఫారిన్ టూర్

|

Jun 02, 2019 | 4:59 PM

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వారం రోజుల పాటు ఆయన కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లనున్నారు. ఈనెల 7న బయలుదేరి తిరిగి 14న చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు. అమరావతికి చేరుకున్న అనంతరం..ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం నేతలతో చంద్రబాబు వరుస సమావేశాలు జరుపుతారని తెలుస్తోంది. కాగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి వారానికి రెండు రోజులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటానని తెలంగాణ నేతలకు బాబు […]

ఈనెల 7 నుంచి చంద్రబాబు ఫారిన్ టూర్
Follow us on

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వారం రోజుల పాటు ఆయన కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లనున్నారు. ఈనెల 7న బయలుదేరి తిరిగి 14న చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు. అమరావతికి చేరుకున్న అనంతరం..ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం నేతలతో చంద్రబాబు వరుస సమావేశాలు జరుపుతారని తెలుస్తోంది. కాగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి వారానికి రెండు రోజులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటానని తెలంగాణ నేతలకు బాబు ఇప్పటికే స్పష్టం చేశారు.