రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సున్నావడ్డీ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దంతో సభ వేడెక్కింది. సున్నా వడ్డీ రుణాలపై సీఎం జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. తననే రాజీనామా చేయాలని సవాలు చేస్తారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. తాము ఇష్టానుసారంగా మాట్లాడటం లేదని.. రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నామని అన్నారు. మూడేళ్లకు రుణాలు ఇచ్చామని బ్యాంకర్లు ఒప్పుకున్నారని.. అలాగే పాత రుణాలు కూడా బ్యాంకర్లు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. 2011 నుంచి రుణాలు కూడా మాఫీచేశామన్నారు. తన దగ్గర ఉన్న రికార్డులను సభ ముందు బయటపెడితే.. జగన్ రాజీనామా చేస్తారా.. లేక ప్రజలకు సమాధానం చెబుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు.