YS Jagan Decision: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం.!

CM YS Jagan Decision: విద్యా విధానంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 'నాడు-నేడు' కార్యక్రమంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో..

YS Jagan Decision: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం.!

Updated on: Feb 25, 2021 | 7:45 AM

CM YS Jagan Decision: విద్యా విధానంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ‘నాడు-నేడు’ కార్యక్రమంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

2021-22 విద్యా సంవత్సరానికి గానూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ సీబీఎస్ఈ విధానాన్ని 2024 నాటికి పదో తరగతి వరకు వర్తింపజేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. అలాగే జగనన్న విద్యా కానుక కిట్‌లో ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.

ఇక ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులకు ఇచ్చే పుస్తకాలు నాణ్యతలో ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ఉండాలని పేర్కొన్నారు. అమ్మ ఒడి పధకం ఆప్షన్‌లో భాగంగా విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు క్వాలిటీతో ఉండాలన్నారు. అలాగే చిన్నారులకు ఎలా బోధించాలన్న దానిపై అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వెంటనే భవనాలు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలల్లో పరిశుభ్రత ముఖ్యమన్న సీఎం.. అందుకోసం 27 వేల మంది ఆయాలను నియమించాలన్నారు. విద్యార్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా క్లాస్‌రూమ్‌లను సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?