నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తా: కన్నాకు బుగ్గన ఛాలెంజ్
కరోనా నిర్ధారణ కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.
కరోనా నిర్ధారణ కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కిట్ల కొనుగోలు కంపెనీలో తాను డైరక్టర్ కాదని ఆయన స్పష్టం చేశారు. సదరు కంపెనీలో తాను డైరక్టర్‌గా ఉన్నానని నిరూపిస్తూ.. రేపు ఉదయం 9 గంటలకే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే కన్నా తన పదవికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు.
అయితే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసింది. ఒక్కో కిట్‌కు రూ.730 చొప్పున చెల్లించి మొదట లక్ష కిట్లను దిగుమతి చేసుకుంది. ఇక మరో రెండు లక్షల కిట్ల కొనుగోలుకు పర్చేజ్ ఆర్డర్‌లో ప్రత్యేకమైన క్లాజ్‌ను పెట్టింది. ఆ క్రమంలోనే దేశంలో ఎవరికి తక్కువ ధరకు అమ్మితే అదే ధర తాము చెల్లిస్తామని దక్షిణ కొరియాకు షరతు కూడా విధించింది. అయితే బుగ్గన డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ ద్వారా ఏపీ సర్కారు కరోనా యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు చేసిందంటూ కన్నా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Read This Story Also: పవన్, మహేష్‌లపై ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!