పవన్ మైండ్‌సెట్ ఇప్పటికీ మారలేదు : మంత్రి బొత్స

| Edited By:

Sep 01, 2019 | 6:31 PM

ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు సెగలు పుట్టిస్తున్నాయి. శనివారం పవన్ చేసిన కామెంట్స్‌పై బొత్స కూడా ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మైండ్‌సెట్ ఇప్పటికీ మారలేదన్నారు ఏపీ మంత్రి బొత్స . ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధానాలకు పవన్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. జనసేన గత ఎన్నికల్లో టీడీపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తూ వచ్చిందన్నారు. అవినీతికి పాల్పడ్డ టీడీపీని […]

పవన్  మైండ్‌సెట్ ఇప్పటికీ  మారలేదు : మంత్రి బొత్స
Follow us on

ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు సెగలు పుట్టిస్తున్నాయి. శనివారం పవన్ చేసిన కామెంట్స్‌పై బొత్స కూడా ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మైండ్‌సెట్ ఇప్పటికీ మారలేదన్నారు ఏపీ మంత్రి బొత్స . ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధానాలకు పవన్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

జనసేన గత ఎన్నికల్లో టీడీపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తూ వచ్చిందన్నారు. అవినీతికి పాల్పడ్డ టీడీపీని ప్రశ్నించకుండా అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని ఆయన మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజలంతా చూశారని చెప్పారు మంత్రి బొత్స.

రాజధాని ప్రాంతం విషయంలో గత ప్రభుత్వం చేసిన దోపిడీని బట్టబయలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సరిగా లేవంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలు అవినీతిని ప్రోత్సహించేవిగా ఉన్నయని, గతంలో రాజధాని అమరావతి ‘సామన్యులకా.. సంపన్నులకా’, రాజధాని లోతట్టు ప్రాంతంలో నిర్మించడం ప్రమాదకరం అనే వ్యాఖ్యలు చేసిన విషయాన్ని పవన్ మర్చిపోయారా? అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఇది ప్రజా రాజధాని కాదు ఒక సామాజిక వర్గానికి చెందిందనే వ్యాఖ్యల్ని పవన్ మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు.

రాజధానిలో భూ దోపిడీకి పాల్పడ్డ వారి పేర్లు చెబుతుంటే వారిపై పోరాడాల్సింది పోయి వైసీపీ ప్రభుత్వం మీద,తన మీద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు బొత్స. జగన్ మాయలో నేను పడ్డానో లేదో తెలియదు గానీ, ప్రజలకు సేవ చేయాలనే ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్దికి చాల సంతోషిస్తున్నానని చెప్పారు మంత్రి బొత్స.