బ్రేకింగ్: రోజాకు షాక్.. అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు..!

| Edited By:

Jan 05, 2020 | 6:41 PM

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమెను సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా రోజా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని కూడా వారు తప్పుపట్టారు. రోజా కారును అడ్డగించిన వారు.. సుమారు 20 నిమిషాల పాటు […]

బ్రేకింగ్: రోజాకు షాక్.. అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు..!
Follow us on

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమెను సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా రోజా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని కూడా వారు తప్పుపట్టారు. రోజా కారును అడ్డగించిన వారు.. సుమారు 20 నిమిషాల పాటు ముందుకు కదలనివ్వలేదు.

అయితే వారికి సర్దిచెప్పేందుకు రోజా ప్రయత్నించినప్పటికీ.. వైసీపీ కార్యకర్తలు మాత్రం మాట వినలేదు.పెద్ద ఎత్తున రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె కారు అద్దాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేత అమ్ములు అనుచరులు ఈ పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తరువాత ఎలాగోలా ప్రారంభాన్ని చేసిన రోజా.. 15 నిమిషాల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి వెనుదిరిగారు. కాగా గత ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా అమ్ములు వర్గం ప్రచారం చేసిన విషయం తెలిసిందే.