ఏపీలో ఆపరేషన్ ముస్కాన్.. 1,371 మంది చిన్నారులు సేఫ్

చిన్నారులను బాలకార్మికులగా మార్చి వారితో పనులు చేయించుకోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ పేరిట ప్రత్యేక తనిఖీలు జరిపి మొత్తం 1371 మంది చిన్నారులను రక్షించారు. రాష్ట్రంలో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సినిమాహాల్స్, వంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. వీరిలో బాలకార్మికులు, వీధిబాలలను అధికంగా గుర్తించారు. 286 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించారు. మిగిలిన వారిని సరైన […]

ఏపీలో ఆపరేషన్ ముస్కాన్.. 1,371 మంది చిన్నారులు సేఫ్
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 8:57 PM

చిన్నారులను బాలకార్మికులగా మార్చి వారితో పనులు చేయించుకోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ పేరిట ప్రత్యేక తనిఖీలు జరిపి మొత్తం 1371 మంది చిన్నారులను రక్షించారు. రాష్ట్రంలో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సినిమాహాల్స్, వంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. వీరిలో బాలకార్మికులు, వీధిబాలలను అధికంగా గుర్తించారు. 286 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించారు. మిగిలిన వారిని సరైన చిరునామా తెలిసే వరకు వారిని చైల్డ్ కేర్ హోమ్‌లో ఉంచి తర్వాత తల్లిదండ్రుల వద్దకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ ఆపరేషన్ ముస్కాన్ గురించి డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ చిన్నారులను బడికి పంపకుండా బాలకార్మికులుగా తయారుచేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.