గ్రామ వాలంటీర్లంటే ఎందుకు చిన్న చూపు.?
ప్రభుత్వ సంక్షేమ పధకాలను లబ్ధిదారుల ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను మొదలుపెట్టింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ సేవలందించేలా ఏపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో ఎంతోమంది నిరుద్యోగులు ఇందులో జాయిన్ అయ్యారు. వీరందరికి నెలకు రూ.5000 వేతనం అందుతుంది. పని ఎక్కువ.. జీతం తక్కువా కావడంతో కొందరు జాయిన్ కాలేదని వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఏపీ ప్రభుత్వం తాజాగా […]

ప్రభుత్వ సంక్షేమ పధకాలను లబ్ధిదారుల ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను మొదలుపెట్టింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ సేవలందించేలా ఏపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో ఎంతోమంది నిరుద్యోగులు ఇందులో జాయిన్ అయ్యారు. వీరందరికి నెలకు రూ.5000 వేతనం అందుతుంది. పని ఎక్కువ.. జీతం తక్కువా కావడంతో కొందరు జాయిన్ కాలేదని వార్తలు కూడా వచ్చాయి.

ఇది ఇలా ఉండగా ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ జీవో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో స్వీపర్ ఉద్యోగానికి నెలకు రూ.12 వేలు చెల్లిస్తామని పేర్కొంది. అయితే స్వీపర్ చేసే పని కంటే గ్రామ వాలంటీర్లే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని… అలాంటి వారికి కేవలం 5 వేలు ఇవ్వడం ఎక్కడి న్యాయమని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
