త్వరలో సీఎం జగన్ అమెరికా టూర్?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ త్వరలో ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఆగస్టు 17వ తేదీ నుంచి 23 వరకు జగన్ పర్యటన ఉండనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పర్యటనలో భాగంగా మిషిగన్-డెట్రాయిట్-కోబో కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్నారై ప్రతినిధులతో ఆయన సమావేశంకానున్నారు. సీఎంగా బాధ్యతలు  చేపట్టిన అనంతరం జగన్ వెళ్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. పర్యటనకు సంబంధించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడికానున్నాయి. కాగా, జగన్‌ ఇటీవలే విజయవాడ పాస్‌పోర్ట్ కార్యాలయంలో సీఎం […]

త్వరలో సీఎం జగన్ అమెరికా టూర్?

Updated on: Jul 15, 2019 | 8:01 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ త్వరలో ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఆగస్టు 17వ తేదీ నుంచి 23 వరకు జగన్ పర్యటన ఉండనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పర్యటనలో భాగంగా మిషిగన్-డెట్రాయిట్-కోబో కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్నారై ప్రతినిధులతో ఆయన సమావేశంకానున్నారు. సీఎంగా బాధ్యతలు  చేపట్టిన అనంతరం జగన్ వెళ్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. పర్యటనకు సంబంధించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడికానున్నాయి. కాగా, జగన్‌ ఇటీవలే విజయవాడ పాస్‌పోర్ట్ కార్యాలయంలో సీఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పొందారు.