రేపు శ్రీకాకుళంకు జగన్.. పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీకారం

ఏపీ సీఎం జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పలసాలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ సెంటర్‌.. ఉద్దానం ప్రజల కోసం తాగునీటి సరఫరా ప్రాజెక్ట్‌.. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం అందించే పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న ఆయన.. గురువారం మధ్యాహ్నం […]

రేపు శ్రీకాకుళంకు జగన్.. పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీకారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 05, 2019 | 8:08 AM

ఏపీ సీఎం జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పలసాలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ సెంటర్‌.. ఉద్దానం ప్రజల కోసం తాగునీటి సరఫరా ప్రాజెక్ట్‌.. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం అందించే పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న ఆయన.. గురువారం మధ్యాహ్నం ఎచ్చెర్లకు చేరుకోనున్నారు. అక్కడ ఎస్.ఎం.పురం ట్రిపుల్ ఐటీలో తరగతి గదులు.. హాస్టల్ బ్లాక్‌లను ఆయన ప్రారంభించనున్నారు. తరువాత విద్యార్థులతో జగన్ ముఖాముఖి నిర్వహించి.. అక్కడి నుంచి అమరావతి చేరుకోనున్నారు.

కాగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం దిశగా జగన్ ప్రభుత్వం తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.50కోట్లతో కిడ్నీ బాధితుల కోసం పలాసలో200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌‌ను ఏర్పాటు చేసేలా జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.