టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ప్రక్కన ఉన్న ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రజావేదికను తమకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు గతంలో లేఖ రాశారు. అయితే ఈ లేఖను పట్టించుకోని ప్రభుత్వం.. ప్రజావేదికను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకుగానూ గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అధికారులు ప్రజావేదిక వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకువెళ్లాలని ఆ పార్టీ నేతలకు సీఆర్డీఏ అధికారులు సూచించారు