మహిళలకు సీఎం జగన్ వరాలు..

| Edited By:

Oct 03, 2019 | 2:46 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళలపై వరాల జల్లు కురిపించారు. మార్కెటింగ్, సహకార శాఖలపై అధికారులతో చర్చించారు. స్థిరీకరణ, మార్కెట్లలో కనీస సదుపాయాలు, మిల్లెట్స్‌ బోర్డులపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. పంటలకు లభిస్తున్న ధరలు, మార్కెట్లపై నిరంతర సమాచారం అందించాలన్నారు. మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరల పై ఎప్పటికప్పుడు సమచారం తెలియజేయాలని చెప్పారు. ఇక మార్కెట్ చైర్మన్లలో సగం మహిళలకే కేటాయించారు. కమిటీల్లో […]

మహిళలకు సీఎం జగన్ వరాలు..
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళలపై వరాల జల్లు కురిపించారు. మార్కెటింగ్, సహకార శాఖలపై అధికారులతో చర్చించారు. స్థిరీకరణ, మార్కెట్లలో కనీస సదుపాయాలు, మిల్లెట్స్‌ బోర్డులపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. పంటలకు లభిస్తున్న ధరలు, మార్కెట్లపై నిరంతర సమాచారం అందించాలన్నారు. మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరల పై ఎప్పటికప్పుడు సమచారం తెలియజేయాలని చెప్పారు.

ఇక మార్కెట్ చైర్మన్లలో సగం మహిళలకే కేటాయించారు. కమిటీల్లో కూడా సగం మహిళలకే ఇవ్వనున్నారు. అక్టోబర్ చివరినాటికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే జారీ అయిన జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పంటలు వేసినప్పుడే వాటికి ధరలు ప్రకటించాలని చెప్పారు. ఆరునెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలన్నారు. కనీస మద్దతు ధరలు లేని పంటలకు కూడా ధరలు ప్రకటించాలి తెలిపారు. అక్టోబరు చివరి నాటికి చిరుధాన్యాలపై బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు సీఎం జగన్. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై సమగ్ర పరిశీలన, అవసరాల మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. జీల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలపై కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అవినీతి, పక్షపాతం సహకార రంగంలో ఉండకూదని జగన్ తెలిపారు.

ఆరుతడి పంటలపై అక్టోబరు 10 నుంచి రైతులు ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు చెప్పారు. అక్టోబరు 15 నుంచి కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. ధరల స్థిరీకరణ, మార్కెట్లో ప్రభుత్వ జోక్యం వల్ల 85 రైతు బజార్లలో రూ.25లకే కిలో ఉల్లిపాయలు విక్రయిస్తున్నామని జగన్‌కు అధికారులు వివరించారు. 660 మెట్రిక్‌ టన్నులు వినియోగదారులకు ఇచ్చామన్నారు. అయితే మళ్లీ ధరలు పెరిగిన క్రమంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.