
Andhra Pradesh Weather Forecast: ఉపరితల ద్రోణి కేరళ తీరప్రాంతానికి దగ్గరలోని ఆగ్నేయ అరేబియా సముద్రము నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తులో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ గాలులు మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఇలా ఉండబోతున్న అమరావతిలోని ఐఎండీ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం:
ఈరోజు(15.04.2021) ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు(30-40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు (16.04.2021), ఎల్లుండి(17.04.2021) ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈరోజు(15.04.2021) దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు (16.04.2021) దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి(17.04.2021) దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు(15.04.2021) రాయలసీమలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు(30-40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు(16.04.2021) రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి(17.04.2021) రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అంచనావేసింది.
ఇవి కూడా చదవండి..SRH ఓటమితో ‘మిస్టరీ గర్ల్’ కంటతడి…సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్