AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavya Maran: SRH ఓటమితో ‘మిస్టరీ గర్ల్’ కంటతడి…సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

IPL 2021 - SRH Mystery Girl - Kavya Maran: ఆదివారం ఎస్ఆర్‌హెచ్ - కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు...నిన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(ఆర్సీబీ) మ్యాచ్‌లోనూ కెమెరా కళ్లన్నీ ఆమె వైపే ఉన్నాయి. మ్యాచ్‌ సందర్భంగా ఆడియన్స్ మధ్య కూర్చొన్న ఆమె హావభావాలను క్యాచ్ చేసేందుకు కెమెరామెన్లు పోటీపడ్డారు.

Kavya Maran: SRH ఓటమితో ‘మిస్టరీ గర్ల్’ కంటతడి...సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Kavya Maran
Janardhan Veluru
|

Updated on: Apr 15, 2021 | 3:45 PM

Share

IPL 2021: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో? ఎవరి వీడియోలు వైరల్ అయిపోతాయో ముందుగానే ఊహించలేం. లేటెస్ట్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మిస్టరీ గర్ల్ పేరు మరోసారి మార్మోగిపోతోంది. ఈ మిస్టరీ గర్ల్ మరెవరో కాదు..చెన్నైకి చెందిన సన్ నెట్‌వర్క్ చీఫ్ కళానిధి మారన్ ఏకైక కుమార్తె కావ్య మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సీఈవో కూడా ఆమే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గ్రౌండ్‌లో దర్శనమిస్తూ టీమ్‌ను కావ్య మారన్ ప్రోత్సహిస్తుంటారు.

ఆదివారం ఎస్ఆర్‌హెచ్ – కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు…నిన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(ఆర్సీబీ) మ్యాచ్‌లోనూ కెమెరా కళ్లన్నీ ఆమె వైపే ఉన్నాయి. మ్యాచ్‌ సందర్భంగా ఆడియన్స్ మధ్య కూర్చొన్న ఆమె హావభావాలను క్యాచ్ చేసేందుకు కెమెరామెన్లు పోటీపడ్డారు. అదే పనిగా ఆమె వైపునకు జూమ్ చేస్తూ కెమెరామెన్లు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ వీడియోలో తెగ వైరల్ అయ్యాయి.

బుధవారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఆరెంజ్ జర్సీని ధరించి ఆటగాళ్లను ప్రోత్సహించింది కావ్య మారన్. చివరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమి చెవిచూసింది. ఉత్కంఠభరిత పోరులో తమ ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్లు అవుట్ అయినప్పుడు…కావ్య మారన్ దాదాపు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఆమె ఫోటోలపై స్పందిస్తున్న నెటిజన్స్…ఆమె కోసమైనా హైదరాబాద్ జట్టు మ్యాచ్‌ను గెలవాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కావ్య మారన్ హావభావాలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు, వీడియోలు…