ప్రభుత్వ బడికే అమ్మ ఒడి : మంత్రి బుగ్గన క్లారిటీ

రోజురోజుకు తగ్గిపోతున్న ప్రభుత్వ  పాఠశాల విద్యార్ధులను మళ్ళీ బడిబాట పట్టేలా చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన పథకం అమ్మ ఒడి.   రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించారు.  దీనిపై ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ప్రయివేటు స్కూళ్ల ఆర్ధిక దోపిడీనుంచి  పేద పిల్లలను తప్పించి వారికి  మెరుగైన విద్య అందించాలని సీఎం జగన్ సంకల్పించారు.  అయితే ప్రతిష్టాత్మక అమ్మ ఒడి పథకం అమలుపై మొదటినుంచి  పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. […]

ప్రభుత్వ బడికే అమ్మ ఒడి : మంత్రి బుగ్గన క్లారిటీ

Edited By:

Updated on: Jun 20, 2019 | 4:45 PM

రోజురోజుకు తగ్గిపోతున్న ప్రభుత్వ  పాఠశాల విద్యార్ధులను మళ్ళీ బడిబాట పట్టేలా చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన పథకం అమ్మ ఒడి.   రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించారు.  దీనిపై ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది.

ప్రయివేటు స్కూళ్ల ఆర్ధిక దోపిడీనుంచి  పేద పిల్లలను తప్పించి వారికి  మెరుగైన విద్య అందించాలని సీఎం జగన్ సంకల్పించారు.  అయితే ప్రతిష్టాత్మక అమ్మ ఒడి పథకం అమలుపై మొదటినుంచి  పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేటు స్కూళ్లకు కూడా వర్తింపజేస్తారని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ప్రభుత్వ స్కూళ్లలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నట్టుగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఒడి పథకంపై దృష్టిపెట్టారు సీఎం జగన్. తమ పిల్లల్ని  ప్రభుత్వ పాఠశాలలకు పంపే తల్లికి రూ.15 వేల రూపాయలు చెల్లిస్తుంది ప్రభుత్వం. ఈ పథకం వచ్చే జనవరి 26 నుంచి అమలుకానుంది.  మొత్తానికి అమ్మ ఒడిపై  మంత్రి బుగ్గన ప్రకటనతో  పూర్తి క్లారిటీ వచ్చింది.