AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. 10వ తరగతి పాఠ్యాంశం నుంచి ‘అమరావతి’ పాఠం తొలగింపు..

Amaravati lesson removed: అమరావతిని కేంద్రంగా చేసుకుని శాతవాహన రాజులు.. వారికంటే ముందు పాలకులు ఏ విధంగా పరిపాలన సాగించారు..

Amaravati: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. 10వ తరగతి పాఠ్యాంశం నుంచి ‘అమరావతి’ పాఠం తొలగింపు..
Amaravati
Shaik Madar Saheb
|

Updated on: Apr 04, 2022 | 11:03 AM

Share

Amaravati lesson removed: అమరావతిని కేంద్రంగా చేసుకుని శాతవాహన రాజులు.. వారికంటే ముందు పాలకులు ఏ విధంగా పరిపాలన సాగించారు.. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేసింది.. ఇలా అనేక అంశాలను వివరిస్తూ 10వ తరగతి తెలుగు పుస్తకంలో 2వ పాఠంగా అమరావతిని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించారు. అయితే.. ఈ సంవత్సరం 10 తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో గతంలో బోధించిన అమరావతి పాఠాన్ని తొలగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అయితే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ (AP Education Ministry) ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున విద్యార్థులపై భారం పడకూడదని వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ ఆదేశాలందే నాటికే పాఠశాలల్లో అమరావతి పాఠాన్ని బోధించినట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

అమరావతి పాఠం తొలగింపుపై పలు విధాలుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిలబస్‌ భారం తగ్గించాలంటే పుస్తకం చివర్లోని పాఠాలను తొలగించే వీలుండగా కావాలనే అమరావతిని తీసివేశారంటూ పలువురు పేర్కొంటున్నారు. అయితే.. ఈ నెల 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్‌ పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలినవి చదువుకుని పరీక్షలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులు సూచనలు చేస్తున్నారు. విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని పేర్కొంటున్నారు.

Also Read:

AP Crime News: బెజవాడలో దారుణం.. కన్నతండ్రిని చంపిన దుర్మార్గుడు.. అడ్డుకోబోయిన శునకంపై..

Matti Water Fest: కర్నూలు జిల్లాలో వినూత్న ఉగాది వేడుకలు.. ఒళ్లంతా బురద రాసుకుని..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!