Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. ఏపీతో పాటు యానంలో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు..

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానులకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో వాయువ్య పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

Updated on: Jul 10, 2023 | 1:22 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. ఏపీతో పాటు యానంలో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని యానాం, ఉత్తరకోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు అంచనావేశారు. ఇదిలా ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం ఉరుముఎలతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

ఇదిలా ఉంటే మంగళవారం కూడా ఉత్తర కోస్తా, యానంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా పలు చోట్ల మాత్రం భారీ వర్షం కురుస్తాయని తెలిపారు. బుధవారం విషయానికొస్తే కొన్ని చోట్ల తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ కోస్తాలో కూడా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు మోస్తారు వర్షాలు కురవనున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురస్తాయి.

మంగళవారం కూడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు సూచించారు. బుధవారం కూడా దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమ విషయానికొస్తే ఈ ప్రాంతంలో కూడా రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..