AP: ఏపీ కేబినెట్ సమావేశం.. చర్చకొచ్చిన కీలక అంశాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో అమరావతి రాజధాని అభివృద్ధి, సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రధానంగా చర్చించారు. సింగపూర్ బృందం అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సహకారం అందించే అవకాశంపై చర్చలు జరిగాయి. మంత్రులతో లోకేష్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం కూడా జరిగింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు(గురువారం) మంత్రివర్గం సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, అమరావతితో పాటు పలు కీలక అంశాలపైనా ఈ మీటింగ్‌లో చర్చించారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, అమరావతి పునర్‌నిర్మాణ పనులు, ప్రధాని మోదీ పర్యటనపై చర్చ సాగింది. అయితే, కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో నారా లోకేష్ బ్రేక్‌ఫాస్ట్ భేటీ అయ్యారు. ఉదయం 9 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్‌లో మంత్రుల బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది.
మంత్రివర్గ సమావేశానికి ముందు ఆనవాయితీగా వస్తోన్న లోకేష్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్. ఇదిలా ఉండగా.. ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్ బృందం పర్యటించనుంది. బుధవారం ఏపీ సీఎస్ విజయానంద్‌తో సమావేశమైన సింగపూర్ ప్రతినిధులు, ఇవాళ సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలవనున్నారు. సీడ్ కేపిటల్ నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం, సింగపూర్ సహకారం కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సహకారం అందించాలని సింగపూర్ బృందాన్ని కోరారు సీఎస్. నిధులకు ఎలాంటి సమస్య లేదని, అమరావతి పుననిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తున్నట్టు సింగపూర్ బృందానికి సీఎస్ తెలియజేశారు.
ఏపీ ప్రభుత్వ ఆహ్వానంతోనే అమరావతిలో సింగపూర్ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ఉన్న నిర్మాణాలను సింగపూర్ బృందం పరిశీలించింది. ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిసి.. స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై చర్చించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి