Amalapuram Tension: అమలాపురంలో హైటెన్షన్.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు..

Amalapuram Tension: అమలాపురంలో కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ కొనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు అదుపు తప్పాయి. అక్కడ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది.

Amalapuram Tension: అమలాపురంలో హైటెన్షన్.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు..
Bus

Updated on: May 24, 2022 | 9:11 PM

Amalapuram Tension: అమలాపురంలో కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ కొనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు అదుపు తప్పాయి. అక్కడ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులు ఆవేశంతో మంత్రి విశ్వరూప్ ఇంటిపైకి దూసుకెళ్లారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. కామనగరువులోని మంత్రి విశ్వరూప్ క్యాంప్ కార్యాలయంపైనా దాడులు చేశారు ఆందోళనకారులు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే విశ్వరూప్ ఇంటి సమీపంలో 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. వీరి రాళ్ల దాడిలో చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తలకు గాయాలయ్యాయి.