Andhra Pradesh: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. కీలక అంశాలపై చర్చలు..

|

Jul 17, 2024 | 8:47 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై విభజన సమస్యలు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చర్చించారు. ఈరోజు తొలి ఏకాదశి కావడంతో ఢిల్లీలోని తన ఇంట్లో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు...

Andhra Pradesh: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. కీలక అంశాలపై చర్చలు..
Chandrababu Naidu
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై విభజన సమస్యలు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చర్చించారు. ఈరోజు తొలి ఏకాదశి కావడంతో ఢిల్లీలోని తన ఇంట్లో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు.

మంగళవారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌తో రాత్రి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకారం సహా ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన బకాయిలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు.. అమిత్ షాను కోరారు. అలాగే విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపైనా చంద్రబాబు, అమిత్ షా భేటీలో చర్చించారు.

ఈ విషయాలను చంద్రబాబు అధికారికంగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఈ వివరించారు. అమిత్‌షాతో జరిగిన భేటీ వివరాలను చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను, విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాలపై చర్చించినట్టు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. గత ప్రభుత్వ అసమర్థత, నిర్వహణా లోపం, అవినీతి వల్ల ఆంధ్రప్రదేశ్‌కి తీరని నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రంతో కలిసి ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

బుధవారం తొలి ఏకాదశి కావడంతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం తొమ్మిదిన్నరకు జన్‌పథ్‌-వన్‌కు వెళ్లిన చంద్రబాబు… కొద్దిసేపు తన నివాసంలో గడిపారు. అధికారిక నివాసం జన్‌పథ్‌-వన్‌లో సీఎం చంద్రబాబును కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కేశినేని చిన్ని , సీఎం రమేష్‌ కలిశారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక జులై 3న మొదటిసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… మూడు రోజుల పాటు ప్రధాని, కేంద్రమంత్రులను కలిశారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టడమే లక్ష్యంగా చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని వివరించి నిధులు ఇవ్వాలని కోరారు. రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి మళ్లీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..