Cock Fight: పల్లెల్లో మొదలైన సంక్రాంతి సందడి.. కత్తి కట్టి కాక్ ఫైట్ సై అంటున్న పందేరాయుళ్లు.. ఎంతటివారైనా లెక్కచేయమంటూ పోలీసులు వార్నింగ్

|

Jan 10, 2023 | 1:06 PM

ఒకవైపు పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నా పందేలకు బరులు రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. నిషేధం, కఠినచర్యలు, జైలు శిక్షలు.. వంటి మాటలు ఎన్ని వినిపించినా ప్రజల్లో తరాలుగా నాటుకుపోయిన సంస్కృతిని కట్టడి చేయడం కానిపని అంటూ నిరూపిస్తున్నారు పందెంరాయుళ్లు. 

Cock Fight: పల్లెల్లో మొదలైన సంక్రాంతి సందడి.. కత్తి కట్టి కాక్ ఫైట్ సై అంటున్న పందేరాయుళ్లు.. ఎంతటివారైనా లెక్కచేయమంటూ పోలీసులు వార్నింగ్
Cock Fight
Follow us on

పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పట్టణ వాసులకు స్వాగతం చెప్పడానికి పల్లెలు రెడీ అయ్యాయి.. మరోవైపు నిగనిగలాడే పందెం కోళ్లు పౌరుషంతో సవాలు చేస్తున్నాయి. పది రోజుల ముందే కోడిపందేలు, గుండాట, పేకాట జోరుగా సాగుతోంది. ఒకవైపు పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నా పందేలకు బరులు రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. నిషేధం, కఠినచర్యలు, జైలు శిక్షలు.. వంటి మాటలు ఎన్ని వినిపించినా ప్రజల్లో తరాలుగా నాటుకుపోయిన సంస్కృతిని కట్టడి చేయడం కానిపని అంటూ నిరూపిస్తున్నారు పందెంరాయుళ్లు.  బరులు సిద్ధమయ్యాయి. సంక్రాంతి కాక్‌ ఫైట్‌కు సై అంటూ పందెంకోళ్లు కాలు దువ్వుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి జోరుమీదుంది. కత్తి గట్టిన పందెంకోళ్లు..యుద్ధానికి సిద్ధమంటున్నాయి. సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి.

ఐతే ఒకవైపు బరులు సిద్ధమవుతుంటే..మరోవైపు కోడి పందాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. నిర్వాహకులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పందేలకు స్థలాలు, తోటలు లీజుకిచ్చేవారికి కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. రూల్స్ బ్రేక్‌ చేసి బరులకు స్థలాలిస్తే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్‌ ఇస్తున్నారు. అంతేకాదు. పలు ప్రాంతాల్లో పందాలకు సిద్ధమవుతున్న బరులను ధ్వంసం చేస్తున్నారు. ఆకివీడు, భీమవరం, అడవి నెక్కలంలో బరులను..ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు.

మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గత మూడేళ్లలో 4వేల కేసులు నమోదయ్యాయి. 7వేల మందిని అరెస్ట్‌ చేశారు. ఐతే ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 15 వందల మందిపై బైండోవర్‌ కేసులు ఫైల్‌ చేశారు. భారీగా కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఐనా సరే తగ్గేదే లేదంటున్నారు నిర్వాహకులు. కోడి పందాలపై ఆంక్షలున్నా.. ఆదేశాలున్నా బరులు గీసేశారు. కాళ్లకి కత్తిగట్టి కోళ్లను రెడీ చేశారు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి పండగ దగ్గర పడుతుండటంతో శ్రీకాకుళం జిల్లా కోడి పందాలు, పేకాట శిబిరాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపద్యంలోనే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. తాజాగా కంచిలి మండలం అంపూరం జాతీయ రహదారి సమీపoలో కోళ్ల పందాలపై దాడి చేశారు పోలిసులు. రహస్య సమాచారం మేరకు మెరుపు దాడి చేసిన పోలీసులు పందెం రాయుల్లను అదుపులోకి తీసుకున్నారు.17 మందిని అరెస్ట్ చేశారు.7 కోడి పుంజులు,21వేల రూపాయిలు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు

గోదావరి జిల్లాల్లో అప్పుడే కోడిపందేల జోరు మొదలైపోయింది. ఇష్టారాజ్యంగా పందెం బరులను రెడీ చేస్తున్నారు జూదంరాయుళ్లు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో పందెం బరులపై టీవీ9 కథనాలు ప్రసారం చేయడంతో కోరంగి పోలీసులు యాక్షన్‌ తీసుకున్నారు. టెంట్‌లు, భారీ సరంజామాను తొలగించారు. అలాగే బరులను ట్రాక్టర్లతో దున్నించారు. సంక్రాంతికి ముగ్గుల పోటీలు… కోకో, కబడ్డీ, వాలీబాల్‌, షటిల్‌లాంటి గేమ్స్‌ ఆడుకోవాలని సూచించారు కాకినాడ రూరల్‌ సీఐ శ్రీనివాసులు. అలా కాకుండా ఎవరైనా కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. ఒకవైపు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా, కోడిపందేలు, గుండాట, పేకాట మాత్రం జోరుగా సాగుతోంది. సంక్రాంతి కోసం ఇప్పట్నుంచే బరులు రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. మరి, పోలీసుల హెచ్చరికలు హెచ్చరికలుగానే మిగిలిపోతాయా? లేక నిజంగానే కంట్రోల్ చేయగలుగుతారా? చూడాలి మరి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..