Visakhapatnam: కమాండోలు నువ్వానేనా అని పోటీకి దిగితే.. విశాఖ వేదికగా..

| Edited By: Narender Vaitla

Jan 22, 2024 | 10:15 PM

ఇందులో 16 రాష్ట్రల పోలీస్ జట్లతో పాటు, ఐటిబిపి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ ఎస్ బీ, అస్సాం రైఫిల్స్, ఆర్పీఎఫ్ లాంటి 7 కేంద్ర పోలీస్ సంస్థల జట్లు పాల్గొంటున్నాయి. అయిదు దశల్లో జరిగే ఈ పోటీల్లో ప్రతి జట్టు తమ స్థాయిలో సామర్థ్యం, నైపుణ్యం పై ప్రదర్శనలు చేస్తాయి...

Visakhapatnam: కమాండోలు నువ్వానేనా అని పోటీకి దిగితే.. విశాఖ వేదికగా..
Commando Competition
Follow us on

ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్‌కు విశాఖ వేదికైంది. గ్రేహౌండ్స్ క్యాంపస్ లో 14వ కాంపిటీషన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా హాజరైన ఏడీజీ, విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్ పోటీలను ప్రారంభించారు. కమాండో కాంపిటీషన్లో… 23 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో 16 రాష్ట్రల పోలీస్ జట్లతో పాటు, ఐటిబిపి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ ఎస్ బీ, అస్సాం రైఫిల్స్, ఆర్పీఎఫ్ లాంటి 7 కేంద్ర పోలీస్ సంస్థల జట్లు పాల్గొంటున్నాయి. అయిదు దశల్లో జరిగే ఈ పోటీల్లో ప్రతి జట్టు తమ స్థాయిలో సామర్థ్యం, నైపుణ్యం పై ప్రదర్శనలు చేస్తాయి. తమ శక్తి సామర్థ్యాలను చాటి చెప్పేలా పోటీ పడతాయి. ఈ సందర్భంగా వివిధ జట్ల సభ్యులు పరేడ్ నిర్వహించారు. వారి నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రసంగాలతో జట్లలో ఉత్సాహాన్ని నింపారు.

విభజన తర్వాత తొలిసారిగా..

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. తొలిసారిగా జాతీయస్థాయి పోలీస్ కమాండో కాంపిటీషన్ ఏపీలో నిర్వహిస్తున్నారు. అందుకు విశాఖ గ్రేహౌండ్స్ కార్యాలయ క్యాంపస్ వేదికైంది. గ్రేహౌండ్స్ క్యాంపస్ లో ఈనెల 30 వరకు పోలీస్ కమాండో కాంపిటీషన్ జరుగుతుంది. ఆపరేషన్ ఏ డి జి ఆర్ కే మీనా పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఖమ్మంలో కాంపిటేషన్ ముగింపు వేడుకలకు ఏపీ డీజీపీ హాజరవుతారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ కమాండో పోటీలు..

అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ రవి శంకర్ అయ్యానార్ మాట్లాడుతూ.. తన పోలీసు కెరియర్‌ను గ్రేహౌండ్స్‌ విభాగంలో అసాల్ట్‌ కమాండర్‌ గా ప్రారంభించానని అన్నారు. ఇది ప్రపంచంలో అత్యుత్తమయిన కమెండో పోటీలని అభివర్ణించిన ఆయన.. అన్ని జట్లు తమ విభాగాలలోని ఉత్తమ కమెండోలను ఈ పోటీలకు ఎంపిక చేశారన్నారు.

ఐదు దశల్లో స్కిల్స్..

గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీపీ రాజీవ్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ.. 13వ ఆలిండియా పోలీస్‌ కమాండో కాంపిటీషన్స్‌ పోటీలు మనేసర్‌ లో జరిగాయని.. దానికి ఎన్‌ఎస్‌జి అతిథ్యం ఇవ్వగా కోవిడ్‌ కారణంగా 11, 12వ ఏఐపీసీసీ రద్దు చేయబడ్డాయని తెలిపారు. ఈ పోటిలకు జాతీయ స్థాయి లో 23 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని , అందులో 16 రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ , హర్యానా , తమిళనాడు , కర్ణాటక , తెలంగాణా , కేరళ , మహారాష్ట్ర , రాజస్థాన్‌, ఒరిస్సా , ఉత్తరాఖండ్‌, జార్కండ్‌, పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ జట్లు కాగా 7 కేంద్ర పోలీసు సంస్థల ఆర్పిఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌, సిఆర్పిఎఫ్‌, సిఐఎస్‌ఎఫ్‌, ఐటిబిటి , ఎస్‌ఎస్బి, అస్సాం రైఫిల్స్‌ జట్లు పాల్గొంటున్నాయన్నారు.

సుమారు 750-800 సభ్యులు ఈ పోటిలలో పాల్గొంటారని.. పోటిలలో అన్ని జట్లు 5 దిశలలో నేవిగేషన్‌ , స్కిల్‌ టెస్ట్‌ , ప్లానింగ్‌ అండ్‌ ప్రెజెంటేషన్‌, ఫిజికల్‌, ఫైరింగ్‌లలో పాల్గొంటాయని అన్నారు. అల్‌ ఇండియా స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన 50 మంది సభ్యుల బృందం విజేతలను నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రత్యేక అతిధిగా ఇన్‌కంటాక్స్‌ ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సింగ్‌ హాజరైన కార్యక్రమంలో.. పోలీస్‌ రిక్రూట్మెంట్‌ చైర్మన్‌ అతుల్‌ సింగ్‌, విశాఖ రేంజ్‌ ఐ.జి హరికృష్ణ , గ్రేహౌండ్స్‌ ఆపరేషన్స్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..