ఆ సంచలనం అడుగు ఇప్పుడు ఎటు పడుతోంది..ఏ జెండాను చూస్తోంది. ఎవరిని మనసులో పెట్టుకుంది.. అదే అన్ని పార్టీల ఎన్నికల వ్యూహం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి ఫ్యామిలీకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి రంగా అభిమానుల సంఖ్య లెక్కలేదు.. రాధాకు అదే ఫాలోయింగ్ .. అయితే ప్రస్తుతం రాధ రాజకీయ భవిష్యత్ ఏంటనేది అభిమానులకు అంతుచిక్కడం లేదు.. ఎట్ ద సేమ్ టైమ్ కలవరపెడుతోంది కూడా.. వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.. ఈసారి ఎన్నికల్లో ఏం చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది..
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచిన రాధా…ఈసారి ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు…ఏపార్టీ నుంచి పోటీలో ఉంటారనే చర్చ పీక్స్‌లో ఉంది. కానీ ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ ఉండటంతో ఇక్కడ సీటు వస్తుందో లేదో తెలియని పరిస్థితి..మరోవైపు వంగవీటి రాధాను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దించుతారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం వచ్చింది. రాధాను తమవైపు తిప్పుకుంటే..ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా కొట్టేయొచ్చు..ఇదే అన్ని పార్టీల నిర్ణయం..రాధా ఇమేజ్‌ను కరెక్టుగా వాడుకుంటే..కుప్పలు కుప్పల ఓట్లు సాధించొచ్చు..అందుకే అంచనా వేస్తున్నారు. ఆరా తీస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సక్సెస్ అయ్యింది. కాపు వర్గంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వేడి చల్లారకముందే..వంగవీటిని జనసేనలో చేర్చుకుంటే ఎన్నికల్లో తిరుగుండదనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక అధికార వైసీపీ కూడా కాపు సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటే…రాధాను కూడా ఫ్యాన్ కిందకు చేర్చాల్సిందేనని భావిస్తోంది.. పైగా రాధా వైసీపీకి పాత కాపు..దీనికి తోడు.. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు రాధా మంచి స్నేహితుడు..ముస్తఫా ముస్తఫా డోన్ట్‌వర్రీ ముస్తఫా అని వీళ్లిద్దరూ కలిసి రాధాను వైసీపీ గూటికి తీసుకెళ్తారని బెజవాడ పొలిటికల్ సర్కిల్ టాక్..
పవన్ టూర్ తర్వాత జనసేన సైనికుల్లో జోష్ పెరిగింది.. రాధా కూడా ఇదే ఆలోచిస్తున్నట్లు అనుచరులు లెక్కలేస్తున్నారట. కొన్ని రోజుల కిందట జనసేన నెంబర్ టు నాదెండ్ల మనోహర్ కూడా రాధా ఇంటికెళ్లి మరీ మాట్లాడారు. అప్పట్లో రాధా జనసేనలోకి వెళ్తారని బాగా ప్రచారం జరిగింది. రెండ్రోజుల క్రితం రంగా జయంతి రోజు కూడా జనసేన నాయకులు, కాపు నేతలు రాధాతో భేటీ అయ్యారు.
వంగవీటి రాధా..మొదట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. వైసీపీలో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత సైకిలెక్కారు. ఎక్కడా ఆయనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని అభిమానులే చెబుతుంటారు. మరి ఇప్పుడు సైకిల్ దిగుతారా..పవన్‌తో కలిసి నడుస్తారా..ఫ్యాన్ కిందకు వెళ్తారా అన్నది అటు ఆల్ పార్టీస్ బాసులతో పాటు..అభిమానులు కూడా బుర్రబద్ధలు కొట్టుకుంటున్నారు. ఇంతకీ రాధా మనసులో ఏముందో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం