చంద్రబాబుకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.. అభినందనలు తెలిపిన మహేశ్‌బాబు, రజనీకాంత్

|

Jun 05, 2024 | 7:17 PM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోపాటు జనసేనా అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌లను సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.

చంద్రబాబుకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.. అభినందనలు తెలిపిన మహేశ్‌బాబు, రజనీకాంత్
Congratulates To Modi Babu
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోపాటు జనసేనా అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌లను సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. అమేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ లోక్‌సభ ఎన్నికల విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే అధినేత, నా ప్రియ మిత్రుడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. అలాగే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించిన నా ప్రియ మిత్రుడు చంద్రబాబు నాయుడుకు నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ నటుడు రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు.

చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన మహేశ్‌బాబు

ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సినీ నటుడు మహేశ్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాబోతున్న నారా చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు.. మీ హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..