Nagarjuna-CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీనటుడు నాగార్జున సమావేశమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సినీ హీరో అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్‌ను కలిసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. ” విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉంది. జగన్ నా శ్రేయోభిలాషి. జగన్‌ను చూసి చాలా రోజులవుతుంది. అందుకే విజయవాడకు వచ్చాను. జగన్‌తో కలిసి లంచ్ చేశాను.”
ఈ ఉదయం హైదరాబాద్ నుంచి నాగార్జునతోపాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి విజయవాడకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి నాగార్జున చేరుకున్నారు. నేరుగా ఇక్కడి నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు.
అయితే ఈరోజు జరుగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశంలో సినీ టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకనే హీరో నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు విజయవాడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ నుంచి ఏ సినీ పెద్దలు .. సినీ నటీనటులు లేరు.. కేవలం ఇద్దరు నిర్మాతలతో వెళ్లినందున ఇప్పుడు సీఎం జగన్ తో సమావేశం టాలివుడ్ సమస్యలపైనా లేక వ్యక్తిగత విషయాలను చర్చించేందుకు వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: YCP VS TDP: ఢిల్లీకి చేరిన ఏపీ ఫైట్.. అమిత్‌షాకు వైసీపీ, టీడీపీ ఎంపీల పోటా పోటీ ఫిర్యాదులు..