AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటకు మాట.. వేటుకు వేటు.. వేధించాడని భయానక శిక్ష.. ఏంటో తెలిస్తే గుండె ఆగుతుంది!

వేధిస్తున్నాడని కాలు నరికేశారు.. పూర్తిగా తెగిపడిన ఆ కాలును గ్రామస్తులకు చూపిస్తూ బైక్‌పై ఊరంతా తిరిగారు నిందితులు. తీవ్ర రక్తస్రావం జరిగి కోలుకోలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సూటి పోటి మాటలతో తరచూ వేధిస్తున్న వ్యక్తి కాళ్లు నరికేసి, దాంతో బైక్‌పై ఊరేగిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

మాటకు మాట.. వేటుకు వేటు.. వేధించాడని భయానక శిక్ష.. ఏంటో తెలిస్తే గుండె ఆగుతుంది!
Kurnool Murder
Balaraju Goud
|

Updated on: Jul 03, 2025 | 11:07 AM

Share

వేధిస్తున్నాడని కాలు నరికేశారు.. పూర్తిగా తెగిపడిన ఆ కాలును గ్రామస్తులకు చూపిస్తూ బైక్‌పై ఊరంతా తిరిగారు నిందితులు. తీవ్ర రక్తస్రావం జరిగి కోలుకోలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సూటి పోటి మాటలతో తరచూ వేధిస్తున్న వ్యక్తి కాళ్లు నరికేసి, దాంతో బైక్‌పై ఊరేగిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

కర్నూలు రూరల్ మండలం సూదిరెడ్డిపల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కురువ శేషన్న అనే 54 ఏళ్ల వ్యక్తి లారీ డ్రైవర్. అదే గ్రామానికి చెందిన పరశురాముడు అనే వ్యక్తిని తరచుగా వేధిస్తున్నాడు. పరశురాముడికి చెవుడు ఉందని, ఏమి చెప్పినా వినపడదని, పరశురాముడి భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నానని అతని వద్దనే గట్టిగా అరుస్తూ చెప్పేవాడు. ఇది భరించలేని పరశురాముడు అదే గ్రామానికి చెందిన కొందరితో తన బాధను చెప్పుకున్నాడు. దీంతో శేషన్నకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే బుధవారం(జూలై 02) అర్ధరాత్రి శేషన్న ఇంట్లోకి దూరిన దుండగులు, వేటకొడవళ్లు, కర్రలు, రాడ్లతో అతనిపై దాడికి తెగబడ్డారు. శేషన్న కాలు తెగిపడింది. తీవ్ర రక్తస్రావం అయింది. శేషన్న భయపడిపోయాడు. భయంతో పాటు రక్తస్రావం జరగడంతో శేషన్న మృతి చెందాడు. శేషన్న కాలును పూర్తిగా నరికేసి.. నరికేసిన కాలును తీసుకుని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై ఊరంతా తిరిగారు. ఈ సంఘటన చూసిన గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.

అయితే, తెగిపడిన శేషన్న కాలును బైక్ పై నిందితులు తీసుకెళ్లి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఆ కాలును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర పడేశారు. గ్రామానికి చెందిన పరుశురాముడు సహా మొత్తం నలుగురు నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. దీనికి వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్