AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భార్య భర్త ప్రియురాలు.. ముగ్గురినీ ఒకటి చేసిన టిక్ టాక్.. కట్ చేస్తే అదిరిపోయే క్లైమాక్స్..

అర చేతిలో ఫోన్..ఫోన్ లో టిక్ టాక్ యాప్.. దేశ యవతను ఓ ఊపు ఊపేసింది. ఎంతో మంది సామాన్యల్ని రాత్రికి రాత్రే స్టార్లను చేసేసింది. తమలో దాగి ఉన్న ట్యాలెంట్ ను బయటకు తెచ్చేందుకు చక్కటి మాధ్యమంగా యూజ్...

Andhra Pradesh: భార్య భర్త ప్రియురాలు.. ముగ్గురినీ ఒకటి చేసిన టిక్ టాక్.. కట్ చేస్తే అదిరిపోయే క్లైమాక్స్..
Marriage
Ganesh Mudavath
|

Updated on: Sep 22, 2022 | 5:30 PM

Share

అర చేతిలో ఫోన్..ఫోన్ లో టిక్ టాక్ యాప్.. దేశ యవతను ఓ ఊపు ఊపేసింది. ఎంతో మంది సామాన్యల్ని రాత్రికి రాత్రే స్టార్లను చేసేసింది. తమలో దాగి ఉన్న ట్యాలెంట్ ను బయటకు తెచ్చేందుకు చక్కటి మాధ్యమంగా యూజ్ అయింది. యువతీ యువకులు, చిన్నా పెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ టైమ్ పాస్ చేసేశారు. చాలా మంది విపరీతమైన ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్నారు. టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పిడింది. ఇద్దరూ కొన్నాళ్లు సన్నిహితంగా గడిపారు. తర్వాత పలు కారణాలతో విడిపోయారు. ఈ క్రమంలో యవకుడికి మరో యువతితో పెళ్లి అయింది. ఆమె కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తుండేది. విషయం తెలుసుకున్న ప్రియురాలు నేరుగా వీరి ఇంటి ముందు ల్యాండ్ అయింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది. తనకు అప్పటికే పెళ్లయిందని చెప్పడంతో అతని భార్యను ఒప్పించింది. అతనంటే చాలా ఇష్టమని, విడిచి ఉండలేనని కంటతడి పెట్టింది. ముగ్గూరూ ఇక్కడే ఉందామని, తనను విశాఖకు వెళ్లమని చెప్పొద్దని వేడుకుంది. దీంతో చేసేదేమీ లేక భార్య.. తన భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసేసింది.

టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చకున్న రాణి అనే యువతికి విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు. తర్వాత వివిధ కారణాలతో దూరమయ్యారు. అదే సమయంలో కడకు చెందిన మరో యువతితో సదరు యువకుడికి పరిచయం అయ్యింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. విషయం తెలుసుకున్న విశాఖ యువతి నేరుగా తిరుపతిలో వీరు ఉంటున్న ఇంటికి వచ్చింది.

Husband Marriage

Husband Marriage

దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. యువకుడిని ప్రేమించానని, తనను విడిచి ఉండలేనని చెప్పింది. ఆ యువకుడి భార్యతో మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని, అందరూ కలిసి ఉందామని నచ్చజెప్పింది. ముందు ఆమె మాటలను వ్యతిరేకించిన భార్య.. తన భర్తపై ఆమెకు ఉన్న ప్రేమను చూసి ఒప్పుకుంది. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి సిద్ధమైంది. తానే దగ్గరుండి భర్త ప్రియురాలిని అలంకరించి మరీ బుధవారం పెళ్లి చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..