AP News: జిల్లా కలెక్టరేట్లో కత్తి కలకలం..కత్తితో కలెక్టర్ వద్దకు వచ్చిన మహిళ.. పోలీసులు ఏం చేశారంటే?

భూ సమస్యపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ కలెక్టరేట్‌లోకి కత్తి తేవడం కలకలం రేపింది. భద్రత సిబ్బంది తనిఖీలో ఇది బయటపడింది. అసలు ఎందుకు మహిళ కత్తి తీసుకొచ్చింది? పోలీసులు ఏం చేశారు?

AP News: జిల్లా కలెక్టరేట్లో కత్తి కలకలం..కత్తితో కలెక్టర్ వద్దకు వచ్చిన మహిళ.. పోలీసులు ఏం చేశారంటే?
A Woman Carried Knife In Puttaparthi Collectorate

Updated on: Nov 04, 2024 | 3:37 PM

శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి కలెక్టరేట్లో ఓ మహిళ కత్తితో రావడం కలకలం రేపింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా మహిళ దగ్గర కత్తి ఉన్నట్లు బయటపడింది. భూ సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రేమలత అనే మహిళ వచ్చింది. కలెక్టరేట్ లోపలికి పంపిస్తుండగా కలెక్టరేట్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఆమె దగ్గర ఉన్న కత్తిని వారు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మరక్షణ కోసమే కత్తి తీసుకొచ్చినట్లు ప్రేమలత పోలీసులకు సమాధానం చెప్పింది.  తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామానికి చెందిన  మహిళగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఒంటరిగా ఉన్న తాను ఆత్మరక్షణ కోసం కత్తిని బ్యాగులో ఉంచుకొని తిరుగుతున్నట్లు మహిళ పోలీసులకు తెలియజేసింది. కత్తిని స్వాధీనం చేసుకుని పోలీసులు మహిళను కలెక్టరేట్లోకి అనుమతించారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి