Andhra Pradesh: పేపర్ దిద్దేందుకా.. బబ్లింగ్ చేసేందుకా.. ఎవాల్యుయేషన్ రూమ్ లో స్టూడెంట్ కలకలం

|

Jun 02, 2022 | 9:35 AM

సాధారణంగా విద్యార్థులు పరీక్ష(Exam) రాస్తారు. ఉపాధ్యాయులు ఆ విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే విద్యా్ర్థులు రాసిన ఆన్సర్ షీట్స్ ను స్టూడెంట్సే కరెక్షన్ చేస్తే..

Andhra Pradesh: పేపర్ దిద్దేందుకా.. బబ్లింగ్ చేసేందుకా.. ఎవాల్యుయేషన్ రూమ్ లో స్టూడెంట్ కలకలం
Srikakulam
Follow us on

సాధారణంగా విద్యార్థులు పరీక్ష(Exam) రాస్తారు. ఉపాధ్యాయులు ఆ విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే విద్యా్ర్థులు రాసిన ఆన్సర్ షీట్స్ ను స్టూడెంట్సే కరెక్షన్ చేస్తే.. చాలు చాలు ఇంకా చెప్పింది అంటారా.. నిజమేనండి.. ఓ కళాశాలలో జరుగుతున్న మూల్యాంకనంలో విద్యార్థి భాగస్వామ్యం కావడం సంచనలంగా మారింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీకాకుళంలోని(Sirkakulam) గవర్నమెంట్ మెన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. విధుల్లోని ఎగ్జామినర్ తో పాటు రూమ్ లో విద్యార్థి కూడా ఉన్నాడు. ఆన్సర్ పేపర్స్ ను దిద్దే రూమ్ లో స్టూడెంట్ కనిపించడం తీవ్ర దుమారం రేపింది. అతని ముందు కరెక్షన్ చేస్తున్నారో.. అతనే కరెక్షన్ చేస్తున్నాడో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ సిహెచ్‌.ఎ.రాజేంద్రప్రసాద్‌, ఎగ్జామినేషన్‌ డీన్‌ లు బుధవారం కాలేజ్ కు వచ్చారు. ఈ ఘటనపై ఆరా తీశారు.

ఎగ్జామినర్ లను సంప్రదించగా.. మార్కులను ఓఎంఆర్‌ షీట్ లో బబ్లింగ్‌ చేసేందుకు విద్యార్థి సహాయం తీసుకున్నట్లు వివరించారు. సదరు ఎగ్జామినర్ ను విధుల నుంచి తొలగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, త్వరలోనే నివేదిక అందిస్తామని తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కు నివేదిక అందించి, ఆయన సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే ఈ కాలేజీలు మూల్యాంకనం జరుపుకుంటున్న సమాధాన పత్రాలు స్థానికమైనవి కావని కళాశాల సిబ్బంది స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి