Riverfront Park: బెజవాడ వాసులకు గుడ్‌న్యూస్.. కనువిందు చేస్తున్న కృష్ణమ్మ కొత్త అందాలు

| Edited By: Janardhan Veluru

Feb 03, 2024 | 7:07 PM

విజయవాడ నగరం ప్రజల ఆహ్లాద నగరంగా మారుస్తున్నరు అధికారులు. బెజవాడ వాసులకు కృష్ణ నది తీరనా ఆహ్లాదకర వాతావరణంలో సుందరమైన, విహార వనాన్ని, నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ, శర వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు. కృష్ణా నదిలో నిర్మిస్తున్న రిటర్నింగ్ గోడ వెంట విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతోంది. విజయవాడలో కనకదుర్గ వారధి నుంచి రామలింగేశ్వరనగర్ డీపీ స్టేషన్ వరకు 1.25 కి.మీ పొడవున పార్కును ఏర్పాటు చేస్తున్నారు.

Riverfront Park: బెజవాడ వాసులకు గుడ్‌న్యూస్.. కనువిందు చేస్తున్న కృష్ణమ్మ కొత్త అందాలు
Vijayawada Riverfront Park
Follow us on

విజయవాడ నగరం ప్రజల ఆహ్లాద నగరంగా మారుస్తున్నరు అధికారులు. బెజవాడ వాసులకు కృష్ణ నది తీరనా ఆహ్లాదకర వాతావరణంలో సుందరమైన, విహార వనాన్ని, నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ, శర వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు. కృష్ణా నదిలో నిర్మిస్తున్న రిటర్నింగ్ గోడ వెంట విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతోంది. విజయవాడలో కనకదుర్గ వారధి నుంచి రామలింగేశ్వరనగర్ డీపీ స్టేషన్ వరకు 1.25 కి.మీ పొడవున పార్కును ఏర్పాటు చేస్తున్నారు. రూ. 12.3 కోట్ల నిధులతో రూపొందుతున్న ఈ పార్క్ పర్యాటలకు అహ్లాదకర వాతావరణంతో మంత్రముగ్ధులను చేయనుంది

రివర్ ఫ్రంట్ పార్క్ నిర్మాణంపై విజయవాడ మహానగర పాలిక ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందుకోసం రూ.7.8 కోట్లు నగరపాలక సంస్థ, రూ.4.5 కోట్లు అర్బన్ గ్రీనరీ నిధులను వినియోగిస్తున్నారు. రిటై నింగ్వాల్ వద్ద పార్కును ప్రజలకు త్వరలో అందుబాటులోకి తేవడానికి పసులు త్వరితగతిన సాగుతున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రీ కెనాఫీ, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, రోడ్లు, బెస్‌మెంట్ పసులు వేగంగా జరుగుతున్నాయి..

కనకదుర్గ వారధి నుంచి రామలింగేశ్వనగర్ వరకు నది వెంబడి ట్రైనింగ్ పార్కు అనుకుని నిర్మిస్తున్న ఈ పార్కులో ఒకేసారి 250-500 మంది వరకు వాకింగ్ చేయ దానికి వీలుగా వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఆహ్లాదాన్ని కలిగించడానికి వివిధ రకాల మొక్కలతో గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. స్వాగత ద్వారం. సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు, వాటర్ ఫాల్స్, రక్షణ గోడకు రెయిలింగ్, లైటింగ్, సిటింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో పాటు ఆధునాతన సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్ద దానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రూ.7.8 కోట్లను ఖర్చు చేస్తోంది.

ఇప్పటికీ రిటైనింగ్ వార్ వెంట ఫిల్లింగ్ చేశారు. రక్షణ గోడ వెంట 21 మీటర్ల వెడల్పుతో, ఆ ప్రాంతంలో ఫిల్లింగ్ చేసి, 19 మీటర్ల మేర బండ్ ఉం తిర్చిదిద్దుతున్నారు. నగరవాసులకు కృష్ణమ్మ చెంత అహ్లాదకర వాతావరణంలో సేద తీరే అవకాశం కలగనుంది. నది వెంట గ్రీనరితో కృష్ణమ్మ అందాలు విజయవాడ వానులకు కనువిందు చేస్తున్నాయి. నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. వాహనాల పార్కింగ్‌కు అనువుగా స్థలాన్ని కేటాయించారు. రాత్రివేళ్లలో కళ్లు మిరిమిట్లు గౌలిపిలా ఆర్చికి వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లకు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరంగా, సుందరంగా పార్కును తీర్చిదిద్దుతూ రివర్ ఫ్రంట్ పార్కును 15 రోజుల్లోపు పూర్తి చేస్తామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. పార్కులో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, పార్కుల్లో ఓపెన్ జిమ్, రాత్రి వేళల్లో అందమైన రంగు కాంతులతో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి చేస్తామని కమిషనర్ వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…