Andhra Pradesh: నల్లమలలో అరుదైన చింకారా.. సిగ్గుపడటం వీటి ప్రత్యేకత.. ఇంకా..

| Edited By: Jyothi Gadda

Sep 26, 2023 | 8:33 PM

చింకారా 26 ఇంచ్‌ల పొడవు, 23 కేజీల వరకు బరువు ఉంటుంది. ఇది మృదువైన, నిగనిగలాడే ఎర్రటి బొచ్చు కలిగి ఉంటుంది. దీని కొమ్ములు 15 ఇంచ్‌ల కంటే ఎక్కువగా ఉంటాయి..ఈ చింకారా ఎండిపోయిన మైదానాలు, కొండలు, ఎడారులు, పొడి పొదలు, తేలికపాటి అడవులలో నివసిస్తాయి... మన దేశంలో ఎక్కువగా రక్షిత ప్రాంతాలలో కనిపిస్తాయి... 2001లో భారతీయ చింకార జనాభా లక్ష వరకు ఉండేందని అంచనా... అయితే

Andhra Pradesh: నల్లమలలో అరుదైన చింకారా.. సిగ్గుపడటం వీటి ప్రత్యేకత.. ఇంకా..
Rare Chinkara
Follow us on

ఒంగోలు, సెప్టెంబర్26; అంతరించి పోతున్న అరుదైన జాతుల్లోని వన్యప్రాణి జంతువు చింకారా నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ ట్రాప్‌ కెమెరాలకు చిక్కింది… ఇది కృష్ణ జింక ను పోలి ఉంటుంది.. దీని కొమ్మలు పొడవుగా పెరిగి రింగులు తిరిగి ఉంటాయి. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌, ఇరాన్ దేశాలతో పాటు మన దేశంలోని రాజస్థాన్ ఏడారి ప్రాంతంలో ఎక్కుకగా కనిపించే ఈ జాతి క్రమేణా అంతరించిపోతూ ఉంది… అలాంటి చింకారా జాతికి చెందిన వన్యప్రాణి నల్లమల అటవీ ప్రాంతంలో కూడా సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు… కర్ణాటకలో చింకారాల ఉనికి ఎక్కువగా ఉంది.

అయితే,  గతంలో ఎప్పుడూ నల్లమలలో కనిపించని చింకారా ప్రస్తుతం ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ గంజివారిపల్లె ఫారెస్ట్‌ రేంజ్ లో కెమెరా ట్రాప్ ల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు… దీంతో వీటి సంఖ్యను తెలుసుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ రేంజ్ పరిధిలో ఎన్ని చింకారా లు సంచరిస్తున్నాయి, వాటి జీవన విధానం తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు… గంజివారిపల్లె రేంజ్ పరిధిలోని నెక్కంటి, గుట్టుల చేను, పాలుట్ల బీట్ లలో ఈ చింకారా ఆనవాళ్ళు ఉన్నట్టు గుర్తించారు… వీటిని గుర్తించేందుకు పది కెమెరాలు ఏర్పాటు చేశారు…

చింకారా 26 ఇంచ్‌ల పొడవు, 23 కేజీల వరకు బరువు ఉంటుంది. ఇది మృదువైన, నిగనిగలాడే ఎర్రటి బొచ్చు కలిగి ఉంటుంది. దీని కొమ్ములు 15 ఇంచ్‌ల కంటే ఎక్కువగా ఉంటాయి… ఇవి చింకారా ఎండిపోయిన మైదానాలు, కొండలు, ఎడారులు, పొడి పొదలు, తేలికపాటి అడవులలో నివసిస్తాయి… మన దేశంలో ఎక్కువగా రక్షిత ప్రాంతాలలో కనిపిస్తాయి… 2001లో భారతీయ చింకార జనాభా లక్ష వరకు ఉంటుందని అంచనా… అయితే క్రూరమృగాలు, వేటగాళ్ళు వీటిని ఎక్కువగా వేటాడటంతో వీటి సంఖ్య రానురాను తగ్గిపోతోంది.

ఇవి కూడా చదవండి

చింకారాలను చిరుతపులులు, బెంగాల్ పులులు, ఆసియా సింహాలు, ధోల్‌లు వేటాడతాయి. చింకారా భారతదేశంలోని కృష్ణజింకలతో పాటు ఆసియా చిరుతలకు సాధారణ ఆహారంగా ఉంటుంది… చింకారాలు సహజంగా సిగ్గును ప్రదర్శిస్తాయి… అందుకే జనవాసాలకు దూరంగా ఉంటాయి. అవి ఎక్కువ కాలం నీరు లేకుండా బతకగలవు… చింకారా జాతిని సంరక్షించడానికి జనవరి 2016న కర్ణాటక ప్రభుత్వం బాగల్‌కోట్ జిల్లాలోని యాదహళ్లి గ్రామంలో వీటి కోసం ప్రత్యేకంగా అభయారణ్యం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాంతం చింకారాలకు ఆశ్రయం కల్పిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..