Andhra Pradesh: ఆసుపత్రిలో రోగిపై లైంగిక దాడి.. ఇలాంటి నీచులు భూమిపై ఎందుకు పుడుతారో..!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా రోగిపై చంద్రశేఖర్ అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం అర్ధరాత్రి మచిలీపట్నానికి చెందిన నాగలక్ష్మీ(25) అనే మహిళా రోగిపై చంద్రశేఖర్ అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు.

Andhra Pradesh: ఆసుపత్రిలో రోగిపై లైంగిక దాడి.. ఇలాంటి నీచులు భూమిపై ఎందుకు పుడుతారో..!
Woman

Updated on: Apr 29, 2023 | 1:21 PM

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా రోగిపై చంద్రశేఖర్ అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం అర్ధరాత్రి మచిలీపట్నానికి చెందిన నాగలక్ష్మీ(25) అనే మహిళా రోగిపై చంద్రశేఖర్ అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ అతడ్ని అడ్డుకున్నాడు. అనంతరం మహిళ తరపున బంధు,మిత్రులు నిందితుడిపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు చంద్రశేఖర్‌ని అదుపులోకి తీసుకున్నారు. 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం బాధిత మహిళ నాగలక్ష్మీపై వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..

ఇవి కూడా చదవండి