Andhra Pradesh: వీడి తెలివి తెల్లారిపోను.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి దొంగనోట్లు ముద్రించేశాడు

|

May 22, 2023 | 4:30 AM

ఏ సమాచారం కావాలన్న యూట్యూబ్‌లో దానికి సంబంధించిన వీడియోలు దొరుకుతాయి. కొంతమంది యూట్యూబ్‌‌లో మంచి విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తే మరికొందరు మాత్రం నేరాలు చేసేందుకు వాడుతున్నారు. ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చూసి దొంగ నోట్లు ముద్రించడం కలకలం రేపుతోంది.

Andhra Pradesh: వీడి తెలివి తెల్లారిపోను.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి దొంగనోట్లు ముద్రించేశాడు
Money
Follow us on

ఏ సమాచారం కావాలన్న యూట్యూబ్‌లో దానికి సంబంధించిన వీడియోలు దొరుకుతాయి. కొంతమంది యూట్యూబ్‌‌లో మంచి విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తే మరికొందరు మాత్రం నేరాలు చేసేందుకు వాడుతున్నారు. ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చూసి దొంగ నోట్లు ముద్రించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా వి.కోట మండలం కె.కొత్తూరుకు చెందిన గోపాల్‌ (41) ఏడో తరగతి చదువుకున్నాడు. కొన్నాళ్లపాటు బెంగళూరులోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేశాడు. ప్రస్తుతం సంతలకు వెళ్లి టీ అమ్ముతున్నాడు.

అయితే వ్యసనాలకు బానిసైన గోపాల్ సులభంగా డబ్బులు ఎలా డబ్బులు సంపాదించాలని అని యూట్యూబ్‌లో చూసేవాడు. అందులో దొంగనోట్లను ముంద్రించే వీడియోలు చూసేవాడు. ఎలాగైన తానుకూడా అలా దొంగనోట్లు ముంద్రించాలని నిర్ణయించుకున్నాడు. చివరికి బెంగళూరుకు వెళ్లి కలర్ ప్రింటర్, ఖాళీ బాండ్ పేపర్లు,కలర్లు, గ్రీన్ నెయిల్ పాలీష్ కొనుక్కువచ్చాడు. దాదాపు 6 నెలల నుంచి తన ఇంట్లోనే రహస్యంగా రూ.500, రూ.200 దొంగ నోట్లను ముద్రిస్తున్నాడు. ఇలా ముద్రించిన సొమ్మును వారపు సంతలోకి తీసువెళ్లి అక్కడ చలామణి చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోపాల్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి 8,200 విలువైన దొంగనోట్లను, ప్రింటర్, ఖాళీ తెల్లకాగితాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించి విచారిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి