
నంద్యాల జిల్లా న్యూస్, ఆగస్టు 27: అతను అనారోగ్యంతో మృతి చెందాడు. కానీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే అంత్యక్రియలు చెయ్యకుండా ఆస్తి కోసం మృతదేహం వద్ద వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది. ఆస్తి పంపకాల విషయం తేలితేనె అంత్యక్రియలు అంటు తెగేసి చెప్పి మృతదేహం వద్ద ఆస్తి పంచాయతి జరగడడాన్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉండే చిన్న వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు భార్యలు,ఆరుగురు సంతానం. మొదటి భార్య వెంకట సుబ్బమ్మ. ఆమెకు మల్లికార్జున, పుల్లయ్య అనే ఇద్దరు కొడుకులు. ఇక రెండవ భార్య బొజ్జమ్మకు లక్షేశ్వరి,సుబ్బమ్మ అనే ఇద్దరు కూమార్తెలు. మూడవ భార్య లక్షీదేవికి వరలక్షీ, ప్రసాద్ అనే ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
రెండవ భార్య బొజ్జమ్మకు రెండవ సంతానం కలిగిన మూడు నెలలకే ఆమె మృతి చెందింది. ఇద్దరు ఆడపిల్లల బాగోగులు కూడా మృతుడు చిన్న వెంకటేశ్వర్లు చూసుకొనేవాడు. చిన్న వెంకటేశ్వర్లు మొదటి భార్య వెంకట సుబ్బమ్మ.. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా ఉంటు జీవనం సాగిస్తూ ఉండేది. ఇక రెండవ భార్య బొజ్జమ్మ మృతి చెందడంతో చిన్న వెంకటేశ్వర్లు మూడవ వివాహం చేసుకున్నాడు. మూడవ పెళ్లి చేసుకున్న రెండవ భార్య,మూడవ భార్య పిల్లల బాగోగులు, వివాహాలు అన్ని చిన్న వెంకటేశ్వర్లు సక్రమంగా నిర్వహించాడు. ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఆస్తి విషయంలో తరుచు పెద్ద భార్య, రెండవ భార్య పిల్లల మధ్య ఎలాంటి వివాదం జరగలేదు. అయితే అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఆస్తి కోసం రక్త సంబంధం పక్కన పెట్టి మృతదేహం వద్ద వాగ్వాదానికి దిగడం అందరిని కలచి వేస్తోంది.
పట్టణంలో ప్రముఖ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో పాటు కుల సంఘంలో కూడా పెద్ద మనిషిగా చెలామణి అయ్యేవాడు చిన్న వెంకటేశ్వర్లు. ఎన్నో పంచాయతీలకు పెద్ద మనిషిగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించేవాడు. అనారోగ్యంతో చనిపోవడంతో తన ఇంటి సమస్య, ఆస్తుల సమస్య తీర్చే వాళ్ళు లేక మృతదేహం రోడ్డు పైనే పడి ఉండటం అందరిని కలచి వేసింది. మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు మొదటి భార్య వెంకట సుబ్బమ్మ, ఆమె ఇద్దరు కొడుకులు వాళ్ళ వారసులతో పాటు రెండవ భార్య ఇద్దరు పిల్లలు మృతదేహం వద్దకు చేరుకున్నారు. మూడవ భార్య లక్షీదేవి అమె కూతురు,కొడుకు పేరుపై ఆస్తులు ఉండటంతో మృతదేహం ముందే పంచాయతి జరగాలంటు గొడవకు దిగారు.
Chinna Venkateshwarlu