Car Plunged into Sea: కారులోని ఆరుగురు యువకులు మద్యం తాగి సముద్రం అంచున చక్కెర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో ఆ యువకుల సరదా కాస్త విషాదం అంచుల్లోకి తీసుకెళ్లింది.. కారు ఒక్కసారిగా సముద్రంలోకి దూసుకెళ్లింది. కానీ తృటిలో ప్రమాదం తప్పింది. అందరూ ఈ ప్రమాదం నుంచొ క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్‌రోడ్‌లో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సముద్రాన్ని తిలకించేందుకు ఆరుగురు యువకులు కాకినాడ బీచ్‌రోడ్‌కు వచ్చారు. ఈ క్రమంలో మద్యం తాగి.. బీచ్‌లో కారుతో చక్కెర్లు కొడుతున్నారు. మద్యం మత్తులో ఉండటంతో.. కారును వేగంగా నడిపారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం ఏర్పడింది. కారు అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. కాగా.. కారులోని ఆరుగురు యువకులు క్షేమంగా బయటపడ్డారు.
వెంటనే సముద్రాన్ని తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. కారులో ఉన్న వారి కోసం పరుగులు తీశారు. అందరూ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం సుమారు రెండు గంటలపాటు కష్టపడి ట్రాక్టర్ సహాయంతో కారును బయటకు తీశారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీశారు. యువకులు ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: