‘తెలుగు’ భాషకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దేశంలో ఇప్పటి వరకు 5 భాషలకు ప్రాచీన భాష హోదా లభించగా.. అందులో తెలుగు భాష కూడా ఒకటి. తెలుగు భాషకు అంతటి ప్రాముఖ్యత, ప్రాశస్తి ఉంది కాబట్టే.. శ్రీకృష్ణదేవరాయలు అంతటి వారు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. ఇదంతా ఇలా ఉంటే.. తెలుగు ప్రాచీనతకు అద్ధంపట్టే మహాద్భుతం ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నయ్య జిల్లా మదనపల్లిలో బయటపడింది. దీనిని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కనిపెట్టారు. ఇప్పుడిది ఆసక్తికరంగా మారింది.
మదనపల్లిలో అత్యంత పురాతనమైన తెలుగు శిలా శాసనం లభ్యమైంది. దీనిని పరిశీలించి పురాతత్వ శాస్త్రవేత్తలు 7వ శతాబ్ధానికి చెందినగా నిర్ధారించారు. రేనాటి చోళులు వేసిన ఏడో శతాబ్ధం నాటిదిగా ఈ శాసనాన్ని గుర్తించారు పరిశోధకులు. కాగా, 50 ఏళ్ల తరువాత రాయలసీమలో మళ్లీ బయటపడింది తెలుగు శాసనం. మదనపల్లి శివారులోని కొత్తరెడ్డి గారిపల్లిలో తమిళనాడులోని సేలం కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి దన్ బాల్ అన్వేషణలో చోళుల కాలం నాటి ఈ శిలా శాసనం బయటపడింది. చోళుల కాలం నాటి వీరగల్లును ఆన్వేషిస్తుండగా.. ఈ శాసనం వెలుగులోకి వచ్చింది. పంట పొలాల్లో ఉన్న ఈ శాసనాన్ని గుర్తించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. మైసూర్ పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు వచ్చి ఈ శాసనాన్ని పరిశీలించారు. ప్రాచీన తెలుగు భాషగా గుర్తించారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..