Andhra Pradesh: పచ్చని చెట్లు అనుకుంటే పొరబడినట్లే.. తనిఖీలకు వెళ్లి అవాక్కయిన పోలీసులు

న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్‌ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి నిల్వలు, గంజాయి సాగును ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ షాక్ ఇస్తోంది.

Andhra Pradesh: పచ్చని చెట్లు అనుకుంటే పొరబడినట్లే.. తనిఖీలకు వెళ్లి అవాక్కయిన పోలీసులు
Vizag Agency

Updated on: Dec 25, 2022 | 7:41 PM

న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్‌ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి నిల్వలు, గంజాయి సాగును ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ షాక్ ఇస్తోంది. ఆపరేషన్‌ పరివర్తన్‌ పేరుతో గంజాయి స్మగ్లర్లకు ముకుతాడు వేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో 2 లక్షల కిలోల గంజాయిని తగలబెట్టారు. ఆదివారం కృష్ణా తీరంలోని దొనబండ క్వారీల దగ్గర 10వేల కిలోలకు పైగా గంజాయిని దగ్ధం చేశారు.

దీంతోపాటు విశాఖ పోలీసులు గంజాయి సాగు పంటలపై దాడులు సైతం నిర్వహించారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటలను ఆదివారం పోలీసులు ధ్వసం చేశారు. ఎస్‌ఈజీ, పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టి భారీగా తోటలను ధ్వంసం చేశారు. జామిగూడ, మెట్టగూడ, జడిగూడ, కింజరగూడ తర్పసింగిలో 66 ఎకరాల గంజాయి తొటలు ధ్వంసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన స్పెషల్ టాస్క్ నిరంతర ప్రక్రియలా మారింది. మన్యం విస్తరించి ఉన్న ఐదు జిల్లాల పరిధిలోను పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ గంజాయ్ స్మగ్లర్లకు పోలీసులు షాకిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా గంజాయి తోటల ధ్వంసం కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈరోజు 51 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా జి మాడుగుల మండలం తర్పసింగిలో 15 ఎకరాల గంజాయి తోట ధ్వంసం చేసినట్టు ఎస్ఈబీ, పోలీసులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..