Andhra News: ఎటుపోతోంది ఈ సమాజం.. 6 ఏళ్ల బాలికపై 65 వృద్ధుడు లైంగిక దాడి

|

Jul 13, 2024 | 9:47 AM

అత్యాచారాలపర్వంలో మరో దారుణం ఇది. అభంశుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేశాడు ఓ కామాంధుడు. ఏపీలోని తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘోరం సంచలనం రేపుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి....

Andhra News: ఎటుపోతోంది ఈ సమాజం.. 6 ఏళ్ల బాలికపై 65 వృద్ధుడు లైంగిక దాడి
Yerpadu
Follow us on

ఏమైపోతోంది మానవత్వం-ఎటుపోతోంది ఈ సమాజం. ఎవడో ఒకడు-ఎక్కడో అక్కడ బరితెగిస్తూనే ఉన్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పాల్పడుతూనే ఉన్నారు. ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. ఆరేళ్ల బాలికపై…65 ఏళ్ల వృద్దుడు లైంగికదాడి చేశాడు. చదవడానికే ఇబ్బందిగా ఉన్న ఈ ఘటన తిరుపతి జిల్లా ఏర్పడు మండలం మూలకండ్రిగలో జరిగింది. ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న బాలికకు చాక్లెట్‌ ఆశ చూపి… నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి.

కామంతో కళ్లు మూసుకుపోయి..మృగాళ్లుగా మారిపోయి, మనవరాలు వయస్సున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు బలరామయ్య అనే వృద్ధుడు. బాలిక రెండ్రోజులుగా నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న బలరామయ్యకోసం పోలీసుల గాలింపు చేపట్టారు.

బాలికపై లైంగిక దాడి ఘటనను సీరియస్‌గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. వేగంగా దర్యాప్తు కంప్లీట్‌చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులకు సీఎంఓ నుంచి ఆదేశాలు అందాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..