Andhra News: న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు ఏం జరిగిందంటే..

| Edited By: Shaik Madar Saheb

Jan 04, 2025 | 12:35 PM

శ్రీకాళహస్తి నుంచి వచ్చిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు శేషాచలం అడవులలో వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు.. వచ్చినవారు అంతటితో ఆగకుండా అటవీ ప్రాంతంలో తిరుగుతూ.. తిరుగుతూ బయటకు వచ్చే దారిని కనుక్కోలేక అటవీ ప్రాంతంలో దారి తప్పిపోయారు. ఈ ఘటన కలకలం రేపింది..

Andhra News: న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు ఏం జరిగిందంటే..
Seshachalam Forest Incident
Follow us on

యువత హాబీలు మారిపోతున్నాయి.. ఫ్రెండ్స్‌తో కలిసి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌లకు వెళ్లడం అక్కడ గడపటం ఇప్పుడు పరిపాటిగా మారింది.. అయితే అవే వారి ప్రాణాలను ఇబ్బందుల్లో పడేలా చేస్తున్నాయి.. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అటవీ, కొండల ప్రాంతాలకు వెళ్తుండటంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొని ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా.. జరిగిన అలాంటి సంఘటన ఒకటి ఏపీలో కలకలం రేపింది.. కొంతమంది యువకులు శేషాచలం అడవుల్లో వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లి సరైన గైడెన్స్ లేక ఒక స్నేహితుడిని కోల్పోవలసి వచ్చింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో గల శేషాచలం అడవులలో వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడకు నిత్యం చాలామంది యువకులు, కుటుంబ సమేతంగా వచ్చేవారు ఉంటారు.. కానీ కొంతమంది యువత వాటర్ ఫాల్స్‌తో ఆగకుండా చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అడ్వెంచర్లు చేయాలని ప్రయత్నించి ఫారెస్ట్‌లో తప్పిపోయి పోలీసులకు పని పెడుతున్నారు.

తాజాగా.. శ్రీకాళహస్తి నుంచి వచ్చిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు శేషాచలం అడవులలో వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు.. వచ్చినవారు అంతటితో ఆగకుండా అటవీ ప్రాంతంలో తిరుగుతూ.. తిరుగుతూ బయటకు వచ్చే దారిని కనుక్కోలేక అటవీ ప్రాంతంలో దారి తప్పిపోయారు. కొత్త సంవత్సరం (న్యూ ఇయర్) ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా యువకులంతా శేషాచల అడవులకు వచ్చారు. నిన్న సాయంత్రం శేషాచలం అడవుల్లో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లి అక్కడి నుంచి అడవి లోపలకు వారు వెళ్లారు. అంతే అక్కడ దారి తప్పిపోవడంతో చేసేదేమీ లేక బిక్కు బిక్కు మంటూ అక్కడే ఉన్నారు. వారి టైం బాగుండి ఎక్కడో ఒకచోట సిగ్నల్ కలిసి రైల్వే కోడూరులోని వారి స్నేహితుడికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.. దీంతో వీరు తప్పిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

వీడియో చూడండి..

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి కాల్ మాట్లాడిన లొకేషన్ ట్రేస్ చేసి అర్ధరాత్రి వరకు గాలించి వారిని తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొని వచ్చారు. అయితే ఈ సమయంలో వారికి ఒక అనుకోని సంఘటన జరిగింది. వారి స్నేహితుడు మృతి చెందాడు. వాటర్ ఫాల్స్ నుంచి అటవీ ప్రాంతంలోకి వెళుతున్న సమయంలో దత్త సాయి అనే ఒక విద్యార్థి అటవీ ప్రాంతంలోని గుంటలో పడి మృతి చెందినట్లు వారి స్నేహితులు చెబుతున్నారు. మృతుడు శ్రీకాళహస్తి దేవాలయంలో మంగళ వాయిద్యం వాయిస్తూ ఉంటాడు..

అయితే పోలీసులు దత్త సాయి మృతి పై విచారణ చేపట్టారు. విద్యార్థులతో కలిసి వెళ్ళిన వారి తోటి స్నేహితుడు గుంటలో పడి చనిపోయాడా లేక మరేదైనా గలాటా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.. ఏది ఏమైనా యువత తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అటవీ ప్రాంతాలకు కానీ ట్రెక్కింగ్ లకు కానీ వెళితే సరైన గైడెన్స్‌తో వెళ్లాలని ఎలా పడితే అలా వెళ్ళి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..