తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న లేదు, పెద్ద లేదు.. అందరూ శునకాల దాడులకు బాధితులే.. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో చిన్నారులే లక్ష్యంగా దాడులకు కుక్కలు తెగబడుతున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేకమంది కుక్కల దాడులతో గాయాల పాలు కాగా.. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
తాజాగా విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండిలో ధనుష్ నందన్ అనే ఐదేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. చిన్నారి కేకలు విన్న తల్లి అపర్ణ బాలుడిని కాపాడింది. అయితే కుక్కల దాడిలో చిన్నారికి గాయాలయ్యాయి. చేతికి తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి ధనుష్ నందన్‌ను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోజురోజుకు కుక్కలు రెచ్చిపోతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడప దాటి రోడ్డుపైకి రావాలంటే ఎక్కడ పిక్కలు పట్టుకొని పీకుతాయో..దాడి చేసి చంపుతాయోనని భయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..